బతుకమ్మ చీరలపై మహిళలు అసంతృప్త

బతుకమ్మ చీరలపై మహిళలు అసంతృప్త

3
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరలపై మహిళలు అసంతృప్త

టీ మీడియా,సెప్టెంబర్ 27, మల్హార్ :ప్రభుత్వం బతుకమ్మ పండగకు అంధించే ఆ నాణ్యత తక్కువ చీరలు మాకొద్దని,నగదు అందజేస్తే తమకు నచ్చిన చీరలు కొనుకొంటామని మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చిరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి మహిళకు బతుకమ్మ చీరను పంపిణీ చేయాలనే ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు చిరల పంపిణీ కార్యక్రమాన్నీ ప్రారంభించే క్రమంలో స్థానిక మహిళలు ఒకేసారి ఆందోళన చేపట్టారు.

Also Read : సుప్రీంకోర్టు జ‌డ్జిగా జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్త‌

ప్రభుత్వం అందించే క్వాలిటీ లేని, నాణ్యత తక్కువ చీరలు వద్దు నగదే అందించాలంటూ నిరసన చేపట్టారు.ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చజెప్పడంతో మహిళలు శాంతిoచారు.అనంతరం మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు,తహశీల్దార్ జీవాకర్ రెడ్డి,సర్పంచ్ సత్తయ్య,ఎంపిడిఓ నరసింహమూర్తి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెంద్రయ్య,వార్డు సభ్యుడు బండి స్వామి,రేషన్ డీలర్లు బూడిద సురేష్,రేపాల ధనంజయ్,లబ్ధిదారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube