ఆర్ధిక భరోసాతోనే మహిళా సాధికారత సాధ్యం.

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 18

మహిళలు ఆర్థిక‌ సాధికారత సాధించాలనే ఉద్దేశ్యంతోనే కుట్టు మిషన్లు ద్వారా ఇంట్లోనే జీవనోపాధి కలిపించనున్నట్లు వాసన్,ఛీరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల ప్రతినిధులు డాక్టర్ కె.సతీష్ కుమార్, అశ్విన్ లు పేర్కొన్నారు. చీరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్థిక సహకారంతో,వాసన్ సంస్థ ఆధ్వర్యంలో మల్లాయిగూడెంలో ఆరుగురు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద, ఒంటరి మహిళలను గుర్తించి వారికి జీవనోపాధి కలిపంచటం జరిగిందన్నారు.వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వహలంబన సాధించాలని కోరారు.ఆధునిక జీవన శైలితో టైలరింగ్ కు పట్టణాల్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు.నూతన పద్ధతుల్లో మహిళలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎ.ఇ.ఒ షాకీరా భాను,దారా ప్రసాద్,కె.మల్లయ్య,కోవ్వసి రాజు,పాయం శివ,సుజాత, ఆర్జుమ్మ,పార్వతి,పొలమ్మ, ధధనలక్ష్మి, శాంతకుమారి, మల్లమ్మ, సుబ్బమ్మ,జ్యోతి,రమాదేవి, రమ్య, సి.ఆర్.పి లు, వాలంటర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Women’s empowerment is possible only with financial security.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube