టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం
టీ మీడియా మార్చి 9, జూలూరుపాడు:మండలం లోని కొమ్ముగూడెం గ్రామంలో బుధవారం జడ్పిటిసి భూక్య కళావతి ఎంపీపీ లావణ్య సోనీ, ఎంపీటీసీ బానోత్ సక్కుబాయిల ఆధ్వర్యంలో మహిళ ప్రజా ప్రతినిధులను, మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. పంచాయతీకి చెందిన మహిళ వార్డు మెంబర్లు కార్యదర్శులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
Also Read : ఉద్యోగ బంధువు కెసిఆర్ – జెడ్పీ చైర్మన్ వసంత సురేష్
స్పోర్ట్స్ కోటాలో సీట్లు సాధించిన ఈశ్వర్ కు అభినందనలు.
అదేవిధంగా కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ బిచ్చు కుమారుడు బానోత్ ఈశ్వర్ క్రీడల్లో ప్రతిభ కనబరచిన నందుకు గాను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ నందు సీటు సాధించినందుకు అభినందించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడo నరసింహారావు గారు, రైతుబంధు మండల కన్వీనర్ యాదళ్ల పల్లి వీరభద్రం, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్, కొమ్ముగూడెం సర్పంచ్ భానోత్ శాంతిలాల్ ఉప సర్పంచ్ కిషన్, బొజ్య తండా సర్పంచ్ లావుడియా కిషన్ లాల్, చింతల్ తండ సర్పంచ్ భూక్యా రాములు, సీనియర్ నాయకులు రామ్ శెట్టి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా కిషన్, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, సోషల్ మీడియా గుగులోత్ రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.