ఉమెన్ ఐకాన్ అవార్డు గ్రహీత కు సన్మానం
టి మీడియా, జూలై 2,ఖమ్మం :అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని గాంధీనగర్ సెక్టార్(36వ డివిజన్ గుట్టల బజార్-2)కు చెందిన అంగన్వాడి టీచర్ గండి అంజురకు ఫిలాంతఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉమెన్ ఐకాన్ 2022 జాతియ అవార్డు అందుకున్న సందర్భంగా 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పసుమర్తి రామ్మోహన్ రావు గారు మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ జక్కుల లావణ్య గారు మరియు గాంధీ నగర్ సెక్టార్ పరిధి లో గల అంగన్వాడీ టీచర్లు అందరూ కలిసి అంజూరాని ఘనంగా సన్మానించారు.
Also Read : డాక్టర్స్ డే సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ గాంధీ చౌక్ లో గత 16 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్ గా లబ్ధిదారులకు చిన్నారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఇతర సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నరని అందుగ్గాను మా డివిజన్ పరిధిలోగల అంగన్వాడీ టీచర్ అంజూర గారికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తన ఉద్యోగ పరంగా ఉన్నతంగా ఎదగాలని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ జక్కల లావణ్య గారు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube