మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర

0
TMedia (Telugu News) :

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర

– ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

టీ మీడియా, అక్టోబర్ 7, లండన్ : భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన‌ నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారత్ ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని చెప్పారు. లండన్‌లోని పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఆమె మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు.

Also Read : ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే.?

ఆ తర్వాత అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధాన మంత్రికి కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారని వివరించారు. అయితే, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడం ఆందోళకరమని, ఓబీసీ మహిళలకు న్యాయం చేయడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube