కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సిఐటియు

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సిఐటియు

1
TMedia (Telugu News) :

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి : సిఐటియు

 

టీ మీడియా, నవంబర్ 5, మధిర: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక లకు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వేంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. మధిర బోడేపూడి భవనం నందు సిఐటియు పట్టణ, మండల మహాసభ పడకంటి మురళి, సృజన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకువచ్చి కార్మిక హక్కులను హరించే విధంగా చూస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అమ్మేస్తుందని ,భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ ఉద్యోగులు,అందని ద్రాక్షలాగా మారుతుందనీ, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాపాడాలని,కనీస వేతన చట్టాన్ని అమలు పర్చాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని,కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని,పని గంటలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Also Read : ప్రజా సమస్యలపై మహాధర్నా

 

అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ… హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, యాభై(50) సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆశా, అంగన్వాడీ ,మధ్యాహ్న భోజన వర్కర్స్ ,ఆర్ డబ్ల్యూఎస్ వర్కర్స్ ,లాంటి వారికి కనీస వేతన సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శీలం నర్సింహారావు, ఐద్వా జిల్లా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి ,రైతు సంఘం జిల్లా నాయకులు మంద సైదులు,ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం ,హమాలీలు బిల్డింగ్ వర్కర్స్,ఆర్టీసీ ,సెంట్రింగ్ ,తదితర కార్మికుల మహాసభలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube