టీ మీడియా, డిసెంబర్ 24, మణుగూరు .
సింగరేణి నందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, గుర్తింపు కార్మిక సంఘముగా ఎన్నిక కాబడిన తర్వాత కార్మిక సంక్షేమం, అభివృద్ధి, నూతన హక్కుల సాధనలో చరిత్ర సృష్టించడం జరిగిందని, వేతనం తో కూడిన సెలవు ఇప్పించిన ఘనత టిబిజికేయస్ దే అని టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు తెలియజేశారు.దేశానికి వెలుగులు ప్రసాధిస్తున్న సింగరేణి కార్మికులు వారి వారి మతాల వారిగా వచ్చే ప్రముఖ పండుగలు కుటుంబ సభ్యులతో కలసి అత్యంత వైభవంగా సంతోషంగా జరుపుకోవాలని టిబిజికేయస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల. కవిత ప్రత్యేక దృష్టి సారించి సింగరేణి నందు అప్షనల్ హాలిడే ను సాధించి పెట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా హిందువులకు సంక్రాంతి పండుగ నాడు క్రిస్టియన్ కార్మికులకు క్రిస్మస్ నాడు , ముస్లిం సోదరులకు రంజాన్ నాడు వేతనం తో కూడిన సెలవు అప్షనల్ హాలిడే అందించడం జరుగుతుందన్నారు.ఈ నెల 25 వ తేదీన క్రిస్టియన్ కార్మిక సోదరులు టిబిజికేయస్ సాధించిన అప్షనల్ హాలిడే ని సద్వినియోగం చేసుకొని కుటుంబ సభ్యులతో క్రిస్మస్ సంతోషంగా జరుపుకోవాలని క్రిస్టియన్ కార్మిక సోదరులకు వారి కుటుంబ సభ్యులకు మణుగూరు టి బి. జి. కె. యస్ తరుపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.