19 మంది కార్మికులు మిస్సింగ్‌

19 మంది కార్మికులు మిస్సింగ్‌

1
TMedia (Telugu News) :

19 మంది కార్మికులు మిస్సింగ్‌..

టి మీడియా,జూలై19,గౌహ‌తి: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతు అయ్యారు. దామిన్ స‌ర్కిల్ వ‌ద్ద బోర్డ‌ర్ రోడ్డు ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం క‌నిపించ‌కుండాపోయారు. రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. చైనాతో ఉన్న వాస్త‌వాధీన రేఖ‌కు స‌మీపంలోనే కార్మికులు అదృశ్య‌మ‌య్యారు.

 

Also Read : రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సు ఢిల్లీకి తరలింపు

అయితే కుమే న‌దిలో ఓ కార్మికుడి మృత‌దేహాన్ని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌ట్లు కాంట్రాక్ట‌ర్ తెలిపారు. ఈద్ పండుగ సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్ట‌ర్ కార్మికుల‌కు లీవ్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube