ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి : ప్రధాని మోడీ

ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి : ప్రధాని మోడీ

0
TMedia (Telugu News) :

ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి : ప్రధాని మోడీ

టీ మీడియా, మార్చ్2, న్యూఢిల్లీ : ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయని, బహుపాక్షికత సంక్షోభంలో ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గురువారం జి20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో బహుపాక్షికత విఫలమైందని పేర్కొన్నారు. బహుపాక్షికత నేడు సంక్షోభంలో ఉందన్న అంశాన్ని అన్ని దేశాలు గుర్తించాలని, గతకొన్ని సంవత్సరాల అనుభవం, ఆర్థిక సంక్షోభం, పర్యావరణ మార్పులు, మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు వంటి పరిస్థితులతో ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అందుకే జి20 అధ్యక్ష బాధ్యతలతో భారత్‌ దక్షిణాది దేశాల తరఫున గళం వినిపించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విభజన సమస్యలపై ఉమ్మడి ప్రకటనను తీసుకురావాలని ప్రధాని ప్రపంచ నేతలను కోరారు.

Also Read : కలలో హోలీ రంగులతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తే శుభమా.. అశుభమా…!

మనల్ని వీడదీసే వాటిపైనే కాకుండా ఏకం చేసేవాటిపైనా మనం దృష్టి పెట్టాలని హితవు పలికారు. వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ఆహార, ఇంధన ఆహార భద్రత సవాళ్లను తగ్గించడానికి ప్రపంచం జి20 వైపు చూస్తోందన్నారు. జి20 సభ్యదేశాలతో పాటు బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, మారిషస్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్‌, సింగపూర్‌, స్పెయిన్‌, యుఎఇ తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube