ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

1
TMedia (Telugu News) :

ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

 

టీ మీడియా, నవంబర్ 20, వనపర్తి బ్యూరో : ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించాలి గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండా ఎగరాలి అని గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిడి శ్రీధర్ తెలిపారు సోమవారం 21వ తేదీ ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఎగరేయాలని తద్వారా ముదిరాజుల ఐక్యతను చాటాలని గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదికాలం నుండి ముదిరాజుల వెనుక బాటుతనాన్ని కారణమైనటువంటి ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత ముదిరాజులదని ముదిరాజుల ప్రధానమైన అటువంటి కోరికలు వెంటనే నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కార్మికులకు పనిముట్లు ఉచిత జీవిత బీమా కల్పించారన్నారు. అదేవిధంగా ముదిరాజుల మత్సకారుల ప్రధాన డిమాండ్స్ ఆరు డిమాండ్లను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవ తీసుకొని ముదిరాజుల మత్సకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

 

Also Read : అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చేయుత

 

విద్య ఉద్యోగాల్లో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయం నివారణ కోసం బిసి డి నుండి బీసీ ఏ మార్చే ప్రక్రియ బీసీ కమిషన్ ద్వారా వెంటనే చేపట్టాలి.అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీల ఎన్నికలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ కు ఎన్నికలు జరిపించాలి. మత్స్య సంపద దోపిడీ నివారణకు కొరకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి.తెలంగాణ మత్స్య శాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల రూపంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నదులు మేజర్ రిజర్వాయర్లలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని చేపట్టి తద్వారా వచ్చే ఆదాయాన్ని మత్స్యకారకు పంచాలి. కార్యక్రమంలో కార్యక్రమంలో వనపర్తి పట్టణ మత్సకార తెలుగు సంఘం అధ్యక్షులు కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ కౌన్సిలర్ కంచరవి మత్స్యకార జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా బాలరాజ్ పట్టణ అధ్యక్షులు ఎర్రమన్యం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube