మనభూమి- మన ఆరోగ్యం
టీ మీడియా, ఏప్రిల్ 08, మధిర:ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కృష్ణాపురం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజ్ నందు ప్రిన్సిపాల్ ఎస్ కె షమీం మేడం అధ్యక్షతన విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు భాస్కర్ రావు మాట్లాడుతూ… ఈ సంవత్సరనినాదం మన భూమి, మన ఆరోగ్యం అంటే పర్యావరణంమార్పుల తోనే ఎక్కువగా ఎండలు, కుండపోత వర్షాలు, జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తున్న ప్రతి మూడు అంటు వ్యాధులలో రెండు జంతువుల నుంచి వచ్చినవే కలుషిత జలాలతో పండే ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే క్యాన్సర్లు, జీర్ణ సంబంధిత అనారోగ్యాలు, ఎలుకల ద్వారా వచ్చే ప్లేగు, మొన్న వచ్చిన బ్లాక్ ఫంగస్, పురుగు మందుల ప్రభావం వల్ల ఆహార పదార్థాలు కలుషితం వల్ల గర్భిణీ స్త్రీలలో సమస్యలు, పిల్లల ఎదుగుదలలో లోపాలు ,పిల్లలకు వచ్చే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయని కావున ప్రజలు గాలి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవాలంటే నివారణ ఒక్కటే మార్గం.
Also Read : డిగ్రీ కళాశాల విద్యార్థులకు నష్టం జరగద్దు
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మాస్క్ ధరించాలి సురక్షిత మంచినీరు త్రాగాలి అనవసరంగా పంటలకు పురుగుమందులు కొట్టరాదు వాహనాల నుంచి వచ్చే పొగ డంప్ యార్డు నుంచి వచ్చే పొగలను పీల్చ కూడదు.సాధ్యమైనంతవరకు సురక్షితమైన మంచినీరు ఎక్కువగా తాగాలి పరిశుభ్రమైన గాలి ఉన్న ప్రదేశంలో మాత్రమే నడవాలి మంచి జీవన విధానాలను పాటించాలి పసుపుపచ్చని ఫ్రూట్స్ ఎక్కువగా తినాలిప్రతి మనిషి ఫిట్నెస్ సాధించాలి. నడవాలి ,పరిగెత్తాలి ,ఆహారంలో ఆకుకూరలు కూరగాయలను ఎక్కువగా తీసుకోవలెనుసకాలంలో వైద్యులను సంప్రదించి తగిన టెస్ట్ చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్స్ శ్రీలత, విద్యార్థులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube