ప్రపంచ శాంతి ర్యాలీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 19 వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలకు ఎండి సత్తార్ ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ సోదరభావం ధర్మచింతన ఉండాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త బోధనలు సూక్తులు సూచించిన ఆధారంగా ధార్మిక విషయాలు అందరూ అనుసరించవలసిన అని తెలిపారు. పెబ్బేరు మండల కేంద్రంలో హజరత్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ప్రపంచ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, కౌన్సిలర్ ఎల్లారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి సత్తార్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ముస్తాక్ ,జామీన్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎండి ఆఫ్టర్, ఉపాధ్యక్షులు ఎండి మజీద్ ,యూత్ అధ్యక్షులు బద్రు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube