800 కోట్లకు చేరిన ప్ర‌పంచ జ‌నాభా

800 కోట్లకు చేరిన ప్ర‌పంచ జ‌నాభా

1
TMedia (Telugu News) :

800 కోట్లకు చేరిన ప్ర‌పంచ జ‌నాభా

టీ మీడియా,నవంబర్ 15, టోండో: యునైటెడ్ నేష‌న్స్ ప్ర‌కారం మంగళవారంతో ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్ల‌కు చేరుకున్న‌ది. అయితే మ‌నీలాలోని టోండోలో మంగళవారం తెల్ల‌వారుజామున 1.29 నిమిషాల‌కు ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు వినీస్ మ‌బాన్సాగ్ అని పేరు పెట్టారు. డాక్ట‌ర్ జోస్ ఫాబెల్లా మెమోరియ‌ల్ హాస్పిట‌ల్‌లో జ‌న్మించింది. ప్ర‌పంచంలో 8వ బిలియ‌న్ వ్య‌క్తి పుట్టిన‌ట్లు పిలిప్పీన్స్‌కు చెందిన జ‌నాభా, అభివృద్ధి సంఘం పేర్కొన్న‌ది.

Also Read : హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా అరెస్ట్

ఆ పాప‌కు చెందిన ఫోటోల‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. ప్ర‌పంచ జ‌నాభాకు వంద కోట్ల మంది కొత్త‌గా జ‌త కావ‌డానికి 12 ఏళ్లు ప‌ట్టిన‌ట్లు ఆ పేజీలో తెలిపారు. ఇక వ‌చ్చే ఏడాది అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశాల్లో చైనాను ఇండియా దాటివేయ‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube