నేడు అరటి చెట్టుకు పూజలు చేస్తే

నేడు అరటి చెట్టుకు పూజలు చేస్తే

1
TMedia (Telugu News) :

నేడు అరటి చెట్టుకు పూజలు చేస్తే…

లహరి,నవంబర్ 17, కల్చరల్ : గురువారం రోజున అరటి చెట్టుకు పూజలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.ఒక రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొ వారంలో ఒక్కొ దేవున్ని పూజించడం ఆనవాయితగా వస్తోంది. అయితే పురణాల ప్రకారం హిందువులంతా గురువారం రోజు శ్రీమహావిష్ణువును పూజిస్తున్నారు.

శ్రీమహావిష్ణువు పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరం కావడమేకాకుండా డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే గురువారం రోజున విష్ణువు అరటి చెట్టులో నివసిస్తాడని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అందుకే చాలా మంది గురువారం రోజున అరటిపండ్లను పూజిస్తారు. అయితే అరటి చెట్టును పూజించి కొన్ని నివారణలు పాటిస్తే జీవితంలో ఉన్న స్థాయికి ఎదుగుతారని.. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తగ్గుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గురువారం ఏం చేయాలో తెలుసుకుందాం.. అరటి చెట్టును పూజించడం వల్ల వక్తుల జీవితాల్లో, జాతకాల్లో కూడా మార్పులు కూడా వస్తాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వివాహ సమయంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి.. ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -ఉదయాన్నే తలస్నానం చేసి అరటి చెట్టుకు రాగి పాత్రలో పసుపుతో కలిపిన నీటిని సమర్పించాలి.

Also Read : ఏలాంటి వారు అయ్యప్ప మాల ధరించాలి

–అరటి చెట్టుకు నీటిని పోసి ప్రదక్షిణలు చేసిన తర్వాత శనగపప్పు, పసుపు ముద్ద, బెల్లం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
-ఇలా గురువారం రోజున అరటిచెట్టును పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
-జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారం రోజు చెట్టుకు పసుపు పూసిన నూలి పోగులతో చుడితే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
-జాతకంలో మార్పులు రావడానికి తప్పకుండా అరటి చెట్టుకు పసుపు గుడ్డను కట్టాల్సి ఉంటుంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube