మాజీ కౌన్సిలర్ కి నివాళి

మాజీ కౌన్సిలర్ కి నివాళి

1
TMedia (Telugu News) :

మాజీ కౌన్సిలర్ కి నివాళి
టీ మీడియా, మార్చి 16, వనపర్తి : పట్టణంలో వశ్యతండాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ వశ్య నాయక్ బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి చిన్నారెడ్డి వనపర్తిలో అందుబాటులో లేకున్నా అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అధైర్యపడవద్దు అని వశ్యనాయక్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ ఘనంగా నివాళులర్పించారు.

Also read:సల, సల మంటున్న వంట నూనె ధరలు

జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ వశ్యనాయక్ లాంటి మంచి మనిషి మరణించడం చాలా బాధాకరం ఇలాంటి గొప్ప వ్యక్తి వశ్యతండాలో ఉండడం ఈ తాండకై గర్వకారణం ఆయన తండాకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కౌన్సిలర్ గా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం ఆయన మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వశ్య నాయక్ పేరుమీదనే ఒక తాండ ఏర్పడడం చాలా గర్వ కారణం అన్నారు.

also read:హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పిసిసి సభ్యులు శ్రీనివాస్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, వనపర్తి పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్, సతీష్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు కోట్ల రవి, రాధాకృష్ణ ,బ్రహ్మం, చీర్ల చందర్, కృష్ణబాబు, చంద్రమౌళి, బాబా, వెంకటేష్, మన్యంకొండ యాదవ్, నాగార్జున, జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మృత దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube