– బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ, ఆర్ధికసాయం

బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శ, ఆర్ధికసాయం

0
TMedia (Telugu News) :

 

 

నేలకొండపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
– బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్ధికసాయం
– రాయిగూడెం అంగన్వాడీ కేంద్రానికి రూ.5వేలు అందజేత
– బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన పొంగులేటి

నేలకొండపల్లి: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నేలకొండపల్లి మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని రాయిగూడెం, బుద్దారం, చెరువుమాదారం, అజయ్ తండా, కొత్తకొత్తూరు, నేలకొండపల్లి గ్రామాల్లో పర్యటించారు. రాయిగూడెంలో కొర్లకుంట నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ పతాని నాగయ్య లు అనారోగ్యంతో బాధపడుతున్నందున పరామర్శించారు.

ALSO READ :బతుకమ్మ చీరల పంపిణీలో కౌన్సిలర్ భర్తల పెత్తనం

అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి ఫర్నిచర్ నిమిత్తం రూ.5వేలను అందజేశారు. బుద్దారంలో పోతగాని సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. చెరువు మాదారంలో పలు కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయాలను అందజేశారు. అజయ్ తండాలో తేజావత్ జంకిభాయ్, భూక్యా రుక్మిణిల కుటుంబాలను పరామర్శించారు. కొత్తకొత్తూరులో గుగులోతు శ్రీను, గునగుండ్ల అనసూర్య, జంగాల బిక్షం, నాదెండ్ల వెంకమ్మ కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయాలను అందజేశారు. నేలకొండపల్లిలో గుంజి చంటి, ముత్తినేని అనంతరామయ్య, కాసాని లక్ష్మీ, పిల్లలమర్రి రమణయ్య, కందుకూరి రంగయ్య, నూయ విజయలక్ష్మి, ఈదయ్య కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. అండగా ఉ ంటానని భరోసా ఇస్తూ ఆర్ధికసాయాలను అందజేశారు. వీటితో పాటు మరికొన్ని కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

 

AALSO READ :ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్.. రేపు మెట్రో రైళ్ల సేవ‌లు పొడిగింపు

బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలు, చిన్నారులతో కలిసి ఆడిపాడారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, మరికంటి రేణుబాబు, యడవల్లి సైదులు, సర్పంచులు అనగాని నర్సింహారావు, గురవయ్య, సామినేని శిరీషా, తేజావత్ పార్వతి, ఈవూరి సుజాత శ్రీనివాసరెడ్డి, బట్టబోతుల కిరణ్, ఎనికె జానకిరామయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మస్తాన్, రవి, వార్డుమెంబర్లు జాన్ రెడ్డి, శ్రీనాధ్, వంగవీటి రవి, గండి కోట సుబ్రమణ్యం, చెర్వు స్వర్ణ, కాసాని నాగేశ్వరరావు, గెల్లా జగన్మోహన్ రావు,కౌంజుల మోహన్ రెడ్డి, బచ్చలకూరి శ్రీనివాసరావు, ముత్తినేని వీరయ్య చౌదరి, ఎంపీటీసీలు దోసపాటి శేఖర్, తేజావత్ కోటేశ్వరరావు, ఇతర మండలాల నాయకులు ఉమ్మినేని కృష్ణ, వట్టికూటి సైదులుగౌడ్, ఇమామ్ భాయ్, గురుమూర్తి, రజనీకాంత్, యువనేత గోపి, ఉపేందర్, పండిట్, గౌస్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube