
చింతకాని : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం చింతకాని మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సీతంపేట, నాగులవంచ, జగన్నాథపురం గ్రామాలను సందర్శించారు. సీతంపేటలో పానకాల స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని పరామర్శించారు. నాగులవంచలో వీరబాబు కుమార్తె ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారని ఆశీర్వదించారు. సీపీఎం నాయకులు రౌతు జగన్నాథంను పరామర్శించారు. జగన్నాథపురంలో సింగు వీరయ్య కిడ్ని ఇపరేషన్ ఇటీవల జరిగింది. అతన్ని పరామర్శించారు. అదేవిధంగా సామినేని వెంకటేశ్వరరావు కంటి ఆపరేషన్ జరగ్గా అతన్ని పరామర్శించారు. కూచిపూడి ప్రతాప్ చనిపోగా వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జిల్లా నాయకులు డా.కోట రాంబాబు, కిలారు మనోహర్, కొండపల్లి శేఖర్ రెడ్డి, సీతారామయ్య, సూర్యప్రకాష్, పూర్ణయ్య, ఏలూరు రమేష్, నారపోగు కొండలరావు, నారపోగు వెంకటేశ్వర్లు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.