వైభవంగా ధ్వజారోహణం

యాదాద్రి భువనగిరి

1
TMedia (Telugu News) :

వైభవంగా ధ్వజారోహణం

యాదాద్రి భువనగిరి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్వనులతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని, ధ్వజ పటాన్ని ఊరేగిస్తూ ధ్వజ స్థంభం వద్దకు తీసుకువచ్చి, ధ్వజారోహణం చేశారు.

alsoread:మహిళ ఫోటో ఏక్సిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ

దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజపటంపై గరుడువంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు ఎగురవేశారు. గరుడ ముద్దలు అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం వీక్షించమని 33 కోట్ల దేవతలను ఆహ్వానం పలుకనున్నారు. ఈ పూజల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈవో గీత, చైర్మన్ నరసింహమూర్తితో పాటు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube