యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
లహరి, ఫిబ్రవరి 15, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం అంకురారోహన జరుగనున్నాయి. 22న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవత ఆహ్వానం, హవనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23 నుంచి ఉదయం, రాత్రి సమయంలో వాహనసేవలు నిర్వహించనున్నారు. మార్చి 3 వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓరామకృష్ణారావు తెలిపారు.
– 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం అంకురారోహన జరుగనున్నాయి.
– 22న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవత ఆహ్వానం, హవనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
– 23 నుంచి ఉదయం, రాత్రి సమయంలో వాహనసేవలు నిర్వహించనున్నారు. 23న మత్స్యావతార అలంకారసేవ, వేదపారాయణం, శేషవాహన సేవ జరుగనుంది.
Also Read : పరీక్షా కేంద్రాల్లో చాట్‌జీపీటీ వాడితే కఠిన చర్యలు
– 24న వటపత్రశాయి అలంకార సేవ, హంసవాహనసేవ నిర్వహిస్తారు.
– 25న శ్రీకృష్ణాలంకరణ సేవ, పొన్న వాహనసేవపై లక్ష్మీనరసింహస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
– 26న గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహ వాహనసేవ జరిపిస్తారు.
– 27న జగన్మోహిని అలంకారసేవ, అశ్వవాహనసేవలు
– 28న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై, రాత్రి గజవాహన సేవతో పాటు స్వామి అమ్మవార్ల తిరుకల్యాణం జరుగనుంది.
– మార్చి 1న గరుడ వాహనసేవ, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.
– 2న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం, దేవతోద్వాసన
– 3న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.
కల్యాణోత్సవాన్ని గతంలో మాదిరి కాకుండా ఈసారి కొండపైన తిరుమాఢవీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 వేల మంది భక్తులు కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓరామకృష్ణారావు తెలిపారు. వీవీఐపీ, వీఐపీలతోపాటు కల్యాణంలో పాల్గొనే భక్తులు, అర్చకులు, డోనర్లు, మీడియా కోసం ప్రత్యేకమైన లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు కల్యాణతంతు స్పష్టంగా కనినిపించే విధంగా 8 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇకపోతే, స్వామివారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ. 3,000 టికెట్ ధరను నిర్ణయించారు. కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, 2 వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. గతంలో స్వామివారి కల్యాణం ఉదయం కొండకింద పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించేవారు. పునర్నిర్మాణం అనంతరం ప్రధానాలయంతోపాటు ఆలయ మాఢ వీధులు విశాలంగా ఉండడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను కొండపైనే నిర్వహిస్తున్నారు.
Also Read : 15 బోగీలతో సికింద్రాబాద్ చేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్
యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి 3 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణ తెలిపారు. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 21వ తేదీ నుంచి మార్చి 3 సాయంత్రం వరకు భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు చెప్పారు. కావున భక్తులందరూ సహకరించాలని కోరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube