యాదవ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు

యాదవ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు

1
TMedia (Telugu News) :

యాదవ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించిన నాయకులు

టీ మీడియా,అక్టోబర్ 20,వైరా : అఖిల భారత యాదవ మహాసభ ప్రచార పోస్టర్ ను గౌరవధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, జిల్లా యువజన అధ్యక్షులుచిత్తారి సింహాద్రి యాదవ్, వైరాలో ఆవిష్కరించారు.ఈనెల 23 10 2022 ఆదివారం నాడు బైపాస్ రోడ్డు ఖమ్మం లోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా విస్తృత సమావేశం జరుగుతుందని, జిల్లాలోని యాదవుల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చ జరపబడుతుందని, జిల్లా గొర్రెల మార్కెట్ యార్డ్ నిర్మాణం, నగదు బదిలీ పంపిణీ కార్యక్రమం, తదితర కార్యక్రమాలపై మరియు గొర్రెలు పెంపకం దారుల సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించబడుతుందని నాయకులు పేర్కొన్నారు.

Also Read : జిల్లా పోలీసుల పనితీరు భేష్

ఈ సమావేశం లో వివిధ రాజకీయ పార్టీలలో పదవులు సాధించిన యాదవ ముఖ్యులకు సన్మాన కార్యక్రమం జరుపబడునని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్, ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి తదితర ప్రముఖులు పాల్గొన్నారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అఖిలభారత్ యాదవ్ మహాసభ నాయకులు తెల్లబోయిన వెంకటరమణ, పొదిలి సతీష్ దొంతబోయిన, వెంకటేశ్వర్లు, దొంతబోయిన వెంకటనారాయణ,వాకదాని బాబురావు, కంప సాటి నారాయణ, మాజీ సర్పంచ్ చప్పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube