నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ప్రోగ్రాం

నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ప్రోగ్రాం

0
TMedia (Telugu News) :

నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ప్రోగ్రాం

– సిఎం జగన్‌

టీ మీడియా, అక్టోబర్ 9, విజయవాడ : వైసిపి పరాధికారుల సమావేశం సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ వేదికపై మాట్లాడుతూ.. డిసెంబర్‌ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తామన్నారు. విజేతలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. భారత్‌ టీమ్‌లో వై నాట్‌ ఏపీ పరిస్థితి రావాలని కోరారు. జనవరి 15 వరకూ ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరం ప్రారంభమవుతుందని సిఎం హర్షాన్ని వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పేదవాడికి పెత్తందార్లకు యుద్ధం జరగనుందని, పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌ అని వర్ణించారు. అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31వరకు బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. బస్సుయాత్ర బఅందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారని చెప్పారు. ప్రతి రోజూ మూడు మీటింగ్‌లు జరుగుతాయన్నారు. ప్రభుత్వం చేసిన మంచి సామాజిక న్యాయం, సాధికారత గురించి చెప్పాలన్నారు. ఇది బస్సుయాత్రే కాదు.. సామాజిక న్యాయయాత్ర అని అన్నారు. పేదవారికి జరిగిన మంచిని గురించి వివరించే యాత్ర అని తెలిపారు. ” మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ” అని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలంతా కూడా శ్రీకారం చుట్టాలన్నారు. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలని కోరారు. 2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే.. ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్‌ రావాలని అన్నారు. నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 10వరకూ వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తఅతంగా తీసుకెళ్లాలని సిఎం తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదని, వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చామని, 15వేల హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని, సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్‌ చేస్తున్నామని సిఎం చెప్పారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని అన్నారు. 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని సిఎం జగన్‌ అన్నారు.

Also Read : ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో

పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అక్క చెల్లెమ్మల సాధికారతకు కఅషి చేశామన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి కేబినెట్‌ వరకూ సామాజిక న్యాయం చేశామన్నారు. వైఎస్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని అన్నారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామన్నారు. రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా అందించామన్నారు. అధికారాన్ని ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నామని సిఎం జగన్‌ చెప్పారు. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube