య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్

య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్

1
TMedia (Telugu News) :

య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్
టి మీడియా,జూన్ 27,న్యూఢిల్లీ : విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్‌ను సోమ‌వారం దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌ర‌య్యారు. అయితే నామినేష‌న్ దాఖ‌లు స‌మ‌యంలో కేటీఆర్ ముందు వ‌రుస‌లో కూర్చున్నారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్, అఖిలేష్ యాద‌వ్, కేటీఆర్, ఏ రాజా, సీతారాం ఏచూరి ముందు వ‌రుసలో ఆశీనులై.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు త‌మ మ‌ద్దతును తెలిపారు. నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం య‌శ్వంత్ సిన్హాతో వీరంతా ముచ్చ‌టించారు. ఇక రెండో వ‌రుసలో తృణ‌మూల్ కాంగ్రెస్, శివ‌సేన‌, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీతో పాటు ప‌లు పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఉన్నారు.

Also Read : మధిర లో పర్యటించి న ఎంపీలునామ , వద్దిరాజు

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున త‌న‌తో పాటు త‌మ ఎంపీలు హాజ‌ర‌వుతున్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube