విద్యాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు...

1
TMedia (Telugu News) :

విద్యాభివృద్ధికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట

-ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

టీ మీడియా,ఆగస్టు 22,రాయవరం:
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాభివృద్ధి పెద్దపెద్ద వేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండలంలోని ఆదివారం చెల్లూరు గ్రామం లో సర్పంచ్ పాలిక రాఘవ గోవింద్ ఆధ్వర్యంలో గ్రామంలో సుమారు కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పాల్గొని గ్రామంలో
సర్వా రాయ జిల్లా పరిషత్ పాఠశాల 63 లక్షల,12 లక్షల ఎంజీఎన్ ప్రాథమిక పాఠశాల, 16 లక్షల రూపాయలతో కృష్ణమ్మ చెరువు లో ఉన్న ప్రాథమిక పాఠశాల లకు ఆధునికీకరణ పనులకు భూమి పూజచేశారు.

 

Also Read : వామపక్ష ల మద్దతు సిగ్గుచేటు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలోఎన్నడూ లేని విధంగా విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రూపాయి అభివృద్ధి పనులు చేస్తే 25 పైసలు పబ్లిసిటీ చేసేవారని కానీ నేడు వైయస్సార్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పబ్లిసిటీ కొరకు కాదని ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తోట పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, వైస్ ఎంపీపీ కొవ్వరి రామిరెడ్డి, గుబ్బల సుబ్రహ్మణ్యం, మేడపాటి రామారెడ్డి, చోడే వెంకటరమణ, చిక్కాల శ్రీరాములు,
చెల్లూరు ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ, వైట్ల వీరవేణి పలివెల రామకృష్ణ, బుద్దాల రాంబాబు, హెచ్ఎం బి. వీరభద్రరాజు, వివిధ గ్రామల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, చెల్లూరు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, హైస్కూల్ మరియు ఎంపీపీ స్కూల్స్, ప్రధనోపాధ్యాయులు, ఉపాధ్యాయలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube