బీసీలకు ఏం చేశారని వైసిపి నేతలు సాధికార యాత్ర

- టిడిపి అధినేత చంద్రబాబు

0
TMedia (Telugu News) :

బీసీలకు ఏం చేశారని వైసిపి నేతలు సాధికార యాత్ర

– టిడిపి అధినేత చంద్రబాబు

టీ మీడియా, జనవరి 4, అమరావతి : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కఅషి చేశానని.. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని గుర్తు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు.”టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నాం. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశాం. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టిడిపియే. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశాం. రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి.. నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్‌ ఇచ్చారా? కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి?రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసిపి ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసింది. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదు.

Also Read : గురుకులాల్లో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు చెల్లించాలి

వైసిపి ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను రద్దు చేశారు. బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేకపోయారు కానీ.. మూడు రాజధానులట! రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని.. దాన్ని పూర్తి చేస్తాం. బీసీలకు ఏం చేశారని వైసిపి నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారు?” అని చంద్రబాబు నిలదీశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube