రాష్ట్రంలో వైసిపి విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి

రాష్ట్రంలో వైసిపి విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి

0
TMedia (Telugu News) :

రాష్ట్రంలో వైసిపి విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి

– సిఎం జగన్‌

టీ మీడియా, డిసెంబర్ 28, అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు. ”జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయి.. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలి.. జనవరి 1వ తేదీ నుంచి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3వేలకు పెంపు.. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం..

Also Read : అర్హులుకు లబ్ది కోసం ప్రజాపాలన

విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం.. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది.ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం.. గతంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు ఉన్నారు.ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి. రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది. నాలుగో కార్యక్రమం వైయస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది.. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరికీ 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది. ఆసరాకోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం.. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం.. చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం.. జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు.

Also Read : ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్ల పై దాడులు సరికాదు

మహిళల్లో సుస్థర జీవనోపాథి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం అన్నారు. పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి.. పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి ఈ బహుమతులు ఇస్తాం.. ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి. ఇక, జనవరి 19 విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. రూ.404 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నిలుస్తుంది” అని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube