దిగుబడి తగ్గినతెల్లబంగారం

మద్దతు ధర పెంచాలని రైతులు డిమాండ్

1
TMedia (Telugu News) :

దిగుబడి తగ్గినతెల్లబంగారం

-గతేడాది ఇధే పరిస్థితి

-ఎకరాకు 4 క్వింటాళ్ల నష్టం

– మద్దతు ధర పెంచాలని రైతులు డిమాండ్

టీ మీడియా, నవంబర్ 26, నల్లగొండ : పత్తి ధర పరుగులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు మించి పలుకుతోంది. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండు ఏర్పడిన నేపథ్యంలో ధర మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పత్తి చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలను ఇంకా ఏర్పాటు చేయలేదు. సీసీఐ ద్వారా మద్దతు ధర చెల్లించి.. పత్తి కొనుగోలు చేస్తామన్న సర్కార్…పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయివేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. . ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు… అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 6.40 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.25 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతేడాది ఖరీఫ్‌లో తగ్గిన పత్తి దిగుబడి.

Also Read : రవీంద్ర ఖని రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి

ఈ ఏడాది కూడా వరుస వర్షాలతో నష్టంపత్తి ధర పరుగులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు మించి పలుకుతోంది. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. అయినా అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండు ఏర్పడిన నేపథ్యంలో ధర మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పత్తి చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలను ఇంకా ఏర్పాటు చేయలేదు. సీసీఐ ద్వారా మద్దతు ధర చెల్లించి.. పత్తి కొనుగోలు చేస్తామన్న సర్కార్…. పట్టించుకోవడం లేదు. దీంతో ప్రయివేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. మహిళల పట్ల ఆయన వ్యాఖ్యలు సరికాదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు…అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 6.40 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.25 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతేడాది ఖరీఫ్‌లో పత్తి దిగుబడి అంతగా రాలేదు. ఈ ఏడాది వరుస వర్షాలతో దిగుబడి తగ్గింది. ప్రస్తుత సీజన్‌లో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని రైతులు భావించగా, 6 నుంచి 8 క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి పూత దశలో అకాలవర్షాలతో పూత రాలిపోయింది. దీంతో తొలి విడత తీసిన పత్తి.. నాణ్యతగా లేదు. గూడ కట్టి ఉండగా మారింది. తొలి విడత పత్తి నాణ్యత లేకున్నా… దిగుబడి తక్కువగా ఉండడంతో క్వింటాలుకు 9 వేల రూపాయలకు పైగా ధర పలుకుతోంది. రెండో దశ పత్తికి మరింత ధర పెరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ…. నేటికీ పత్తి కొనుగోళ్లను ప్రారంభించ లేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు 6 వేల 380 రూపాయలుగా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌‌లో క్వింటాలుకు 9వేల రూపాయలకు పైగా ధర పలుకుతుండడంతో సీసీఐ కొనుగోళ్లు చేపట్టడం లేదు. గతంలో ఉమ్మడి జిల్లాలోని జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు నిర్వహించింది.

Also Read : బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

ఈ సీజన్‌లో దిగుబడి తక్కువగా ఉండటం…. బహిరంగ మార్కెట్‌లో ధర అధికంగా ఉండటంతో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించలేదు. కొద్దిరోజుల్లో ధర మరింత పెరుగుతుందని భావిస్తున్న రైతులు… ప్రస్తుతం పత్తి తీసి నిల్వ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీలకు డిమాండ్‌ పెరిగింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద లారీ దగ్ధం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోవడం వారికి కలిసొచ్చింది. ట్రాన్స్‌పోర్ట్‌ చేసి జిన్నింగ్‌ మిల్లులకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న రైతులు గ్రామాల్లోనే దళారులకు పత్తిని విక్రయిస్తున్నారు. ధర పెరిగే అవకాశం ఉన్నా ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులు ఉన్న కొద్దిపాటి పత్తిని దళారులకు విక్రయిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న రైతులు మాత్రం పత్తిని ఇళ్లలో నిల్వ చేస్తున్నారు. పత్తి పంటకు కొనుగోళ్ల కోసం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర పెంచాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube