స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
టి మీడియా,జూన్ 22,ఖమ్మం సిటీ:
శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు “యోగా” ఒక చక్కటి మార్గం అని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా”స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం యోగా ద్వారా పరిష్కారం అవుతుందని,చిరు ప్రాయం ఉండే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు మరియు యోగా లాంటి కార్యక్రమాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : హెల్త్ కార్డు ఆవిష్కరించిన సివిల్ జడ్జి ధీరజ్ కుమార్
ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో నే ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించేందుకు “యోగా” అభ్యాసాన్ని జీవితంలో ఒక భాగంగా తీసుకోవాలని అన్నారు. యోగాలో ఆసనాలు మరియు యు.కె నిత్యం యోగా చేయడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన అన్నారు. దైనందిక జీవితంలో లో ఎన్ని ఒత్తిడుల మధ్య ప్రారంభ మయ్యే పనులు కేవలం యోగా ద్వారా శాంతి చేకూరుతుందని, పాఠశాలల్లోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మంచి లక్షణాలను యోగా చేసే ఈ క్రమాన్ని తమ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందని దీని ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ అలవడుతుంది. ఒక మంచి అలవాటుగా మారుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరియు యోగా శిక్షకుడు క్రాంతి పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube