నిత్యయోగాతో ఆరోగ్యం
-కలెక్టర్ అనుదీప్
టి మీడియా, జూన్ 22,భద్రాద్రి కొత్తగూడెం:
నిత్యం యోగా చేయడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిపురస్కరించుకుని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని, అటవీశాఖ సెంట్రల్ పార్కులో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్న గౌతమ బుద్దుని విగ్రహానికి పూల మాలలు వేసి పలు ఆసనాలు, మెడిటేషన్ చేశారు. యోగా దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు అందచేసి అభినందించారు. అనంతరం పార్కు నుండి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ర్యాలీ నిర్వహించి ప్రయోజనాలను వివరించారు.
Also Read : కాశీకి నివాళులర్పించిన సిపిఎం నాయకులు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. యోగా మన దేశంలో ప్రాచీన కాలం నుండి చేస్తున్న మంచి ఆరోగ్యకరమైన కార్యక్రమమని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను వారి వారి జీవన శైలిలో ఇనుమడింప చేసుకోవాలని చెప్పారు. నిత్యం యోగా చేయడం వల్ల బిపి, కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని చెప్పారు. యోగా చేయడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోగలమని చెప్పారు. యోగా చేయడం వల్ల మనస్సు, ఆరోగ్యంతో పాటు మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. యోగాతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పక ప్రతి రోజూ యోగా చేయాలని ఆయన సూచించారు.
Also Read : మద్యం సేవించి వాహనాలు నడిపితే కటిన చర్యలు తప్పవు
యోగాపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనపై విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆయుష్ శాఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానందస్వామి, ర.భ. ఈ ఈ భీమ్లా, జిల్లా ఇరిగేషన్ అధికారి అర్జున్, పిఆర్ ఈఈ సుధాకర్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ఆర్డీఓ స్వర్ణలత, కలెక్టరేట్ ఏఓ గన్నా, లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ నాగరాజు, యంపిడిఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube