యోగజీవనం

యోగజీవనం

0
TMedia (Telugu News) :

యోగజీవనం

లహరి, ఫిబ్రవరి 14, కల్చరల్ : యోగజీవనం సిద్ధించడానికి ప్రాణా యామం, ఆసనాల్లాంటివి సాధనాలు. యో గమంటే పరిపూర్ణ జీవన విధానం. తొణికిస లాడే అద్భుతమైన జీవన కళ! యోగ స్థితి ఉన్నతమైందని గీతాచార్యుడు బోధించా డు. యోగి కావాలని అర్జునుణ్ని స్వయంగా ఆదేశించాడు. శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనస్సుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలగాలి. అది అం త సులభం కాదు. ఈ స్థితిని సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో జీవించాలి. ఆలోచించాలి. ఆ జీవన విధానాన్ని యోగ సాధన అంటారు. శరీరం, మనసు కేంద్రీకృతమైనప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతారు.రామాయణం ప్రారంభంలో వాల్మీకి వర్ణించిన పదహారు సత్పురుషుల లక్షణాలలో ‘ఆత్మవాన్‌’ అనేది ఒకటి. ‘రాముడు ఆత్మవిదుడు’ అన్నారు వాల్మీకి. అది యోగ లక్షణం. ”నీకు పట్టం కడుతున్నాను. నిన్ను రాజును చేస్తున్నాను” అని తండ్రి దశరథుడు అన్నప్పుడు రాముడు పట్టరాని ఆనందంతో పొంగిపోలేదు.

Also Read : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలపై విరుచుకుపడ్డ విపక్షాలు

ఆ మరుసటి రోజే ”నువ్వు పధ్నాలుగు సం వత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళు” అని అన్నప్పుడు కుంగిపోలేదు. అడవుల్లో కష్టాలకు కంటతడి పెట్టిన దాఖలాలు లేవు. ”ఏనాడో పాపం చేసి పుట్టాను. ఇలా అడవుల వెంట… భార్యను వెదుకుటకై ఇలా ఈ కోతిమూకతో వేగుతున్నాను” అని చింతించిన ఘట్టాలు లేవు. భరతునితో, విభీషణుడితో, గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నా డు. అయోధ్యలో వున్నా, అడవిలో వున్నా ఒకేలా జీవించగలిగాడు. ఒకేలా వుండగలిగాడు. అదే యోగజీవనమంటే!
ఇంతటి స్థిరచిత్తం, స్థిత ప్రజ్ఞత రావాలంటే తననుతాను తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అదుపు చాలా ముఖ్యం. అందుకే యోగమంటే చిత్తవృత్తుల నిరోధంగా పతంజలి మహర్షి నిర్వచించారు. మన శరీరంలో 72వేల నాడులు, 206 ఎము కలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు కోశాలు, అనేక ధాతువులు ఉన్నా యి. శరీరం పటిష్టంగా ఉండాలంటే నాడీ మండలం దృఢంగా ఉండాలి.మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే ఆరు చక్రా ల్ని అధిగమిస్తే పరమపదమైన సహస్రార చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అందుకోవడానికి సాధకులు సాగించే మార్గమే యోగ. ‘ఉద్దరేదాత్మనాత్మనం’ తనను తానే ఉద్ధరించుకోవా లి. ఇది యోగావలంబనకు మౌలిక సూత్రం. ఆరోగ్యమనేది ఒకరి నుంచి అరువు తెచ్చు కునేది కాదు. ఆధ్మాత్మిక శక్తి ఒకరు ధారపోస్తే సంక్రమించేది కాదు. ఎవరికి వారు శోధించు కోవాలి. సాధించాలి. ఆస్వాదించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube