పీఠంపై నువ్వా..నేనా.

– రచ్చ కెక్కుతున్న రగడ

0
TMedia (Telugu News) :

పీఠంపై నువ్వా..నేనా..
– రచ్చ కెక్కుతున్న రగడ
– కొనసాగుతున్న కోల్డ్ వార్

టి మీడియా, డిసెంబర్ 20,నాగార్జునసాగర్ : నూతనంగా ఏర్పడిన నందికొండ మున్సిపాలిటీలో అనేక సమస్యలు, టూరిజం ప్రాంతం కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మునిసిపాటి లో నువ్వా నేనా అనే విధంగా టఫ్ వార్ కొనసాగుతుంది.నందికొండ మున్సిపల్‌ చైర్ పర్సన్ అనూష రెడ్డి పై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.11 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో బిఅరెస్ 5మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారుఅందులో.కాంగ్రెస్ 4గురు నందికొండ చైర్పర్సన్ అనూష రెడ్డి పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం నోటీసును అందజేశారు.

Also Read : న్యూ ఇయ‌ర్ వేడుక‌లపై ఆంక్షలు..

అవిస తీర్మానంతో రచ్చకెక్కిన రగడ
తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్-37 ప్రకారం గత జనవరిలో నందికొండ మున్సిపల్ చైర్పర్సల్ కర్ణ అనూష రెడ్డి పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కొనసాగించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది నాగార్జునసాగర్ లో రెండు కాలనీలు అందులో పైలాన్,హిల్ కాలనీ కలవు పైలాన్ కాలనీకి చెందిన మహిళ చైర్మన్ గా కర్ణ అనూష రెడ్డి పదవిలో ఉన్నారు. అదే విదంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఈ సారి హిల్ కాలానికి చెందిన దళిత మహిళ నాగ శిరీష మోహన్ నాయక్ కు చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి..హిల్ కాలానికి చైర్మన్ ఇస్తే పైలాన్ కు వైస్ చైర్మన్ ఇవ్వాలని పట్టు బట్టుకుని కూర్చోవడం విశేషం… నందికొండ మున్సిపాలిటీలో రిజర్వేషన్ ప్రకారం మహిళలకు చైర్ పర్సన్ పదవి దక్కే అవకాశం.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube