రోడ్డుపై మ‌ద్యం తాగిన‌ యూట్యూబ‌ర్ అరెస్టుకు రంగం సిద్ధం

రోడ్డుపై మ‌ద్యం తాగిన‌ యూట్యూబ‌ర్ అరెస్టుకు రంగం సిద్ధం

0
TMedia (Telugu News) :

రోడ్డుపై మ‌ద్యం తాగిన‌ యూట్యూబ‌ర్ అరెస్టుకు రంగం సిద్ధం

టీ మీడియా, ఆగస్టు 19,డెహ్రాడూన్‌: యూట్యూబర్ బాబీ క‌టారియాను ఉత్త‌రాఖండ్ పోలీసులు అరెస్టు చేయ‌నున్నారు. దీని కోసం రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర రాజ‌ధాని డెహ్రాడూన్‌లోని ఓ వీధిలో.. కుర్చీ వేసుకుని యూట్యూబ‌ర్ క‌టారియా మ‌ద్యం సేవించాడు. పోలీసుల్ని బెదిరించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో అత‌నిపై కేసు న‌మోదు అయ్యింది. ఐపీసీలోని 342, 336, 290, 510 సెక్ష‌న్ల కింద కేసును బుక్ చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేష‌న్‌లో నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు.

 

Also Read : బకాయిలు చెల్లించాం.. నిషేధం వర్తించదు

 

యూట్యూబ‌ర్ క‌టారియాను అరెస్టు చేసేందుకు హ‌ర్యానాకు పోలీసుల్ని పంపిన‌ట్లు ఓ ఆఫీస‌ర్ తెలిపారు. ఇటీవ‌ల ఓ స్పైస్‌జెట్ విమానంలోనూ అత‌ను సిగ‌రేట్ తాగాడు. దాంతో అత‌ను ఇంట‌ర్నెట్‌లో ఫేమ్ అయ్యాడు. ఫిబ్ర‌వ‌రిలో అత‌న్ని నో ఫ్ల‌యింగ్ జాబితాలో చేర్చారు. ఆ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ అదో డ‌మ్మీ విమానం అని, దుబాయ్‌లో షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ వీడియో తీసిన‌ట్లు బాబీ క‌టారియా తెలిపాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube