ఘనంగా అమృత్యోత్సవాల యువ సమ్మేళనం

ఘనంగా అమృత్యోత్సవాల యువ సమ్మేళనం

1
TMedia (Telugu News) :

ఘనంగా అమృత్యోత్సవాల యువ సమ్మేళనం

 

టీ మీడియా, నవంబర్ 20, వనపర్తి బ్యూరో : నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత్యోత్సవాల యువ సమ్మేళనం ఆదివారం జయప్రదమైనది.వనపర్తి, అమరచింత,ఆత్మకూరు,పెబ్బేరు, కొత్తకోట,గద్వాల సమీప గ్రామ ప్రజలు, జూనియర్ ,డిగ్రీ కళాశాలల విద్యార్థులు సుమారుగా 1800 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు.
తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.వివిధ క్షేత్ర నాయకులు విచ్చేశారు.ప్రధాన వక్త ఎక్కా చంద్రశేఖర్ ఆనాటి సాంఘీక,ఆర్థిక,మత ,పాలనా పరిస్థితులను వివరిస్తూ మార్గనిర్ధేశం చేశారు.రజాకార్ల ఆరాచకాలతో అట్టుడికిన గ్రామాలను ఆయా గ్రామ ప్రజలు ఎలా అడ్డుకున్నారో వివరించారు.దేశభక్తితో ఆనాటి యువత ఆర్యసమాజం ద్వారా చేసిన త్యాగాలను మరవరాదని తెలిపారు.

 

Also Read : నివాళులు అర్పించిన టీజేఎస్ నాయకులు

 

మత దరహంకారంతో నిజామ్ ప్రజల పైకి ఉన్మాదులను ఉసిగొల్పి,చేసిన భైరాన్ పల్లి సంఘటనలను తెలిపి హాజరు అయిన యువతకు దేశభక్తి ఆవశ్యకతను భోదించారు.స్వర్ణముఖి అకాడమీ వారు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని రోజారమణి తన పాట, మాటలతో అలరించారు.దేశభవితలో యువత పాత్ర ను రామన్న వివరిస్తూ నేటి సమకాలీన సమాజంలో యువకులు తమ విలువైన పాత్రను పోషించాలని,దుష్టపన బాగాలను గుర్తించి దేశభక్తితో మెలగాలని తెలిపారు.కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సేవా ప్రముఖ చంద్రశేఖర్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు జానంపేట లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి,వివాహ కార్యవాహ పత్తికొండ రాములు ,జిల్లా సహకార పోతుల అమరేందర్ కావలి, వివిధ క్షేత్రాల సంఘాలు విద్యార్థిని విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube