యువజన కాంగ్రెస్ నాయకులు అరెస్టు

1
TMedia (Telugu News) :

యువజన కాంగ్రెస్ నాయకులు అరెస్టు

టీ మీడియా, జనవరి 29,జన్నారం.

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ మరియు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తునందుకు నిరసన గా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాoప్ కార్యాలయం ముట్టడి కి వెళ్తుండగా జన్నారం మండల యువజన కాంగ్రెస్ నాయకులను మార్గ మధ్యలో అరెస్టు చేసి నాయకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు
ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే నోటిఫికేషన్ ని విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మిగితా వారికి నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేలు ఇవ్వాలని ప్రభుత్వం ని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఇంచార్జి సయ్యద్ ఇమ్రాన్,మంద రాజేష్, అబ్దుల్ ముజ్జు,గొర్రె మహేష్ యాదవ్,దూమల్ల ప్రవీణ్, రాకేష్ గౌడ్, కొల మహిపౌల్,రోహిదాస్,రవీందర్, నాగరాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, ఉపాధ్యక్షులు అంబడిపెళ్లి మహేష్, ప్రధాన కార్యదర్శి ఫాసిఉల్లా,SC సెల్ అధ్యక్షులు మామిడిపెళ్ళి ఇందయ్య,పార్టీ సీనియర్ నాయకులు దాముక కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube