లోన్ వేధింపులకు వ్యక్తి మృతి

లోన్ వేధింపులకు వ్యక్తి మృతి

0
TMedia (Telugu News) :

లోన్ వేధింపులకు వ్యక్తి మృతి

టీ మీడియా, అక్టోబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన దాసరి శేఖర్ (32) ఆదివారం రాత్రి ఉరివేసుకొని మరణించారు. లోను వేధింపులు మృతిపాశంలా మారిన లోన్ యాప్ వేధింపులు వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తూ నిత్యం నరకము చూపిస్తూ ప్రాణాలను బలికొంటున్న వైనం ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శేఖర్ లోన్ యాప్ ద్వారా రెండు వేల రూపాయల అప్పు తీసుకున్నాడని దానికి గాని దాదాపు 30 వేల రూపాయల దాకా చెల్లించాడని అయినా కూడా లోన్ యాప్ వాళ్లు కుటుంబ సభ్యుల ఫోటోలు వైరల్ చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube