యువత క్రీడలను సద్వినియోగం చేసుకోవాలి

యువత క్రీడలను సద్వినియోగం చేసుకోవాలి

1
TMedia (Telugu News) :

యువత క్రీడలను సద్వినియోగం చేసుకోవాలి

టీ మీడియా, మార్చి 15 ,వేములవాడ:
గ్రామీణ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం స్థానిక సర్పంచ్ చిలుక అంజిబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ వారు టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటు క్రీడల్లో రాణించాలన్నారు.

Also Read : పాటల సీడీ ఆవిష్కరణ

క్రీడలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ఇరవై వేలు నగదు. ద్వితీయ బహుమతి పది వేలు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. క్రీడల్లో పాల్గొనే జట్లు 1500 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ రావు, రవీందర్ రెడ్డి, పుల్కం మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో 30 జట్లు పాల్గొన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube