వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు.

-పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు 

1
TMedia (Telugu News) :

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు.

-పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు

పాల్గొన్న ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు

టి మీడియా, నవంబరు6,తాడేపల్లి  : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంఎల్సీ లు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, వాసుబాబు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భరోసానే ఎన్నికల మేనిఫెస్టో గా పెట్టిన సీఎం జగన్.. మేనిఫెస్టో లో 98% పూర్తి చేశారని అన్నారు. జగన్‌ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, బలవంతుడైన జగనన్న ను ఎదుర్కోలేక.. పార్టీని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. పవన్ చంద్రబాబు కూల్చేస్తాం అనడానికి ఇదేమైనా పేక మేడా అని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచీ మనల్ని చంద్రబాబు కానీ పవన్ కానీ దూరం చేయలేరని మంత్రి స్పష్టం చేశారు

Also Read : ఆధ్యాత్మికం అంటే .

కూలిపోయిన పార్టీ టీడీపీ
151 స్ధానాల నుంచీ 175 స్ధానాలకు వెళ్ళాలనే లక్ష్యంతో అందరూ పనిచేయాలని, కుప్పంతో సహా మొత్తంగా పవన్, చంద్రబాబు లను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఐదేళ్ళ ముందు 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, సీఎం జగన్ గుండె నిబ్బరం, ధైర్యంతో చేసిన పాదయాత్ర ఏపీకి సంక్షేమ పాలన తెచ్చిందన్నారు. జగన్‌ సామాజిక విప్లవానికి తెర తీశారని అన్నారు. బీసీలకు ఏదో చేశామని చెప్పుకున్న నేతలు.. చేసిందేమి లేదని ఆరోపించారు.సీఎం జగన్ అందరికి సముచితమైన స్ధానం ఇవ్వడం ఒక చరిత్ర అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమం సీఎం జగన్ చేశారని, గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వెన్ను విరిచారని విమర్శించారు. గడప గడపకు వెళితే అందరూ ధైర్యంగా జగన్ మాకు అన్నీ ఇచ్చారు.. మరల జగన్ రావాలని అంటున్నారు కోరుతున్నారని, కొందరు పాదయాత్రలో కార్లు, బస్సులు ఎక్కి దిగుతారు.. అది కాదు పాదయాత్ర కాదన్నారు. పాదయాత్ర ఎలా చేయాలో చేసిన పేటెంట్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే దక్కుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube