ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

టి మీడియా, జులై 8,మధిర : మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని విక్రమార్క గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ కండువావేసి పూలమాలతో.ఘనంగా నివాళులర్పించారు. జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ని కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు

 

Also Read : ఎస్పీ ని కలసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

ఈ సందర్భంగా నందిని విక్రమార్క గారు మాట్లాడుతూ
ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు దివంగ‌త ముఖ్య‌మం‌‌త్రి వైయ‌స్ రాజశేఖర రెడ్డి‌‌… పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైయ‌స్సార్‌ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో,బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయిబర్స్‌మెంట్‌ అనుభవాల్లో వైయ‌స్ రాజశేఖర రెడ్డి‌‌ కనిపిస్తారు. అందరూ బాగుండాలి అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్మిన వ్య‌క్తి. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.
వైఎస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సమస్యలు చూసి చలించిపోయిన ఆయన.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు..
వైఎస్‌ను పేదల సీఎంగా‌ నిలబెట్టింది ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేతను మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు..

 

Also Read : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయకుమార్ మండల ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కోరంపల్లి చంటి మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మండల మహిళ ఉపాధ్యక్షురాలు అయోషా కమల్ పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షురాలు మైలవరపు లక్ష్మీ స్వాతి కాంగ్రెస్ నాయకులు ఆవుల కిరణ్, కోట డేవిడ్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, మాగం ప్రసాద్, గద్దల విజయ్.. మొదలగువారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube