పంజాగుట్టలో వైఎస్ షర్మిల అరెస్ట్

ఎస్‌ఆర్ నగర్ కి తరలించిన పోలీసులు

1
TMedia (Telugu News) :

పంజాగుట్టలో వైఎస్ షర్మిల అరెస్ట్

-ఎస్‌ఆర్ నగర్ కి తరలించిన పోలీసులు

-పీఎస్ వద్ద టెన్షన్ వాతావరణం

టీ మీడియా ,నవంబర్ 29,హైదారబాద్‌ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్‌తో పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల అరెస్ట్‌ను అడ్డుకుంటూ ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న తనను టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని షర్మిల ఆరోపించారు. పాదయాత్ర చేస్తున్న తనను మహిళ అని కూడా చూడకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు.పంజాగుట్టలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పాదయాత్రలో తన కారు, ప్రచార వాహనంపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్‌టీపీ కార్యకర్తలతో కలిసి ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల ప్రయత్నించారు.

Also Read : అయ్యప్పకు కళ్లుచెదిరే ఆదాయం

నిన్న దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుతూ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరారు. సోమాజీగూడ మీదుగా ప్రగతిభవన్ వెళ్తుండగా పంజాగుట్టలో పోలీసులు అడ్డుకుని షర్మిలను అరెస్ట్ చేశారు.షర్మిల లోపల ఉండగానే ఆమె కారును క్రేన్‌తో లిఫ్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. షర్మిల కారు లోపల ఉండగానే.. అమీర్ పేట మీదుగా ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వాహనాన్ని పోలీసులు తరలించారు. పోలీసులు క్రేన్‌పై తీసుకెళ్లుతుండగా షర్మిల కారు డోర్ లాక్ చేసుకుని డ్రైవింగ్ సీటులోనే కూర్చుని ఉన్నారు. కారు దిగాలని పోలీసులు రిక్వెస్ట్ చేసినా.. ఆమె బయటకు వచ్చేందుకు నిరాకరించారు. షర్మిల అరెస్ట్‌తో వైఎస్సార్‌ టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సోమాజీగూడ-ఎస్‌ఆర్ నగర్ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.కారులోనే షర్మిల.. క్రేన్‌తో లిఫ్ట్ చేసి లాక్కెళ్లిన పోలీసులు షర్మిలను పంజాగుట్ట నుంచి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు ఎంతచెప్పినా షర్మిల బయటకు రాకపోవడంతో… చివరికి కారు డోర్లను పోలీసులు తెరచి ఆమెను బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న వైఎఎస్సార్‌టీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో షర్మిలను పోలీసులు లోపలికి తీసుకెళ్లారు.

Also Read : కార్మికుల అధ్వర్యంలో సూపరింటెండెంట్ కు వినతి

షర్మిల అరెస్ట్ క్రమంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
షర్మిల పాదయాత్ర ఇటీవల వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌పై ఆమె ఘాటు విమర్శలు చేశారు. షర్మిల వ్యాఖ్యలను తప్పుబడుతూ సోమవారం టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. ఆమె ప్రచారవాహనం, కార్లపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. షర్మిల బస చేసే కారవాన్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో షర్మిలను పాదయాత్ర ఆపేయాలని పోలీసులు కోరారు. కానీ అందుకు నిరాకరించిన షర్మిల.. పాదయాత్ర కొనసాగించే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కి తరలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube