వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా

షర్మిలకు అండగా ఉండేందుకే నిర్ణయం

1
TMedia (Telugu News) :

వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా

-షర్మిలకు అండగా ఉండేందుకే నిర్ణయం

టీ మీడియా,జూలై 8,గుంటూరు: వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. వైకాపా ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వెతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు.

Also Read : సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నమంత్రి సత్యవతి రాథోడ్

కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా, సంతోషం ఉన్నప్పుడు కూడా జగన్‌కే అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి’’అని ఆమె అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube