‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవం
టీ మీడియా, నవంబర్ 1, విజయవాడ : ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్’ అవార్డులను అందజేసింది. బుధవారం ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆయా రంగాల్లో ఎంపికైన 27మందికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయమన్నారు. నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం అందుతోందన్నారు. అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదువులు ఇచ్చి న్యాయం చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఏపీ 7వ స్థానంలో నిలిచిందని చెప్పారు. వికేంద్రీకరణతో ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసిందని, అన్ని ప్రధాన రంగాల్లో రాష్ట్రం అభివఅద్ధిలో మందుకు సాగుతోందని గవర్నర్ అన్నారు. సిఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : కేంద్రం కనుసన్నల్లోనే విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్
మూడేళ్లుగా అవార్డులు అందించే సాంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివఅద్ధి జరిగిందని చెప్పారు. 7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మందికి, సంస్థలకు పురస్కారాలు ఇస్తున్నామన్నారు. 23 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, 4 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశామన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube