వై ఎస్ ఆర్ ప్రజాలగుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు

పిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి

1
TMedia (Telugu News) :

వై ఎస్ ఆర్ ప్రజాలగుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు
-పిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి
-రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నివాళి

టి మీడియా, జులై 8,పంజాగుట్ట: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలబెట్టిన నాయకుడు వైఎస్‌ఆర్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటారని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరంలోని పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

 

Also Read ; గిరిజన భవన్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

‘‘ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్‌ఆర్ మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. ఉమ్మడి ఏపీని దేశమే ఆదర్శంగా తీసుకునేలా సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించారు. వారు అమరులైనా.. ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. వైఎస్‌ఆర్ ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube