వైయస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి కమిటీ ఎన్నిక…….

0
TMedia (Telugu News) :

షర్మిలమ్మ పాదయాత్ర ను విజయవంతం చేయవలసింది గా కోరిన ……..జిల్లా కోఆర్డినేటర్ నరాల

టీ మీడియా అశ్వరావుపేట నవంబర్ 30

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు నలుమూలలు నుండి హాజరయ్యారు. వైస్సార్ తెలంగాణ పార్టీ మండల నాయకులు కూరపటి నరేష్ అధ్యక్షత న జరిగిన ఈ సమావేశముకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ నరాల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని షర్మిలమ్మ నాయకత్వంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే మన ధ్యేయమని ఎస్సీ ఎస్టీ బిసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి రైతులకు మహిళలకు తెలంగాణలో సరైన న్యాయం అందించుట కొరకు షర్మిలమ్మ పాదయాత్ర నిర్వహిస్తుంది అని వారి యొక్క కష్టసుఖాలు పంచుకుని తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తుందని ఆ పాదయాత్ర ను విజయవంతం చేయవలసిందిగా గా కోరారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ కమిటీ ని ఎన్నుకున్నారు. నియోజకవర్గ కన్వీనర్ గా పువ్వాల కొండలరావు,కూరపటి నరేష్ లను ఎన్నుకున్నారు. అలాగే నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ గా సయ్యద్ ఫిరోజ్,అశ్వారావుపేట యువజన కన్వీనర్ గా ఫేక్ అఫ్రిది, ప్రచార కమిటీ కన్వీనర్ పండూరి ప్రసాద్, మహిళా కన్వీనర్ గా షేక్ జాన్ బీ ని ఎన్నుకున్నారు.అలాగే వైయస్సార్ తెలంగాణ పార్టీ అశ్వరావుపేట మండల అధ్యక్షులుగా రెడ్డి మల్ల రాజు, దమ్మపేట మండల అధ్యక్షులుగా శ్రీనివాస రావు, దమ్మపేట మహిళా అధ్యక్షురాలిగా శ్రీకాకుళం సత్యవతి ప్రధాన కార్యదర్శిగా శ్రీ రాములు వెంకటేశ్వర్లు మరి కొంతమంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నిక కాబడిన నాయకులతో ప్రమాణస్వీకారం చేయించి పార్టీకి కట్టుబడి పని చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేకే రాములమ్మ,శ్రీలత,రామాచారి తదితరులు పాల్గొన్నారు.

YSR Telangana Party Aswaraupeta Constituency Level Committee Election.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube