చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలి

0
TMedia (Telugu News) :

చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలి
నామ కుఎమ్మెల్సీ ఎల్ రమణ విజ్ఞప్తి

టీ మీడియా, మార్చి11,హైదరాబాద్:చేనేతపై జీరో జీఎస్టీ అయ్యేలా కృషి చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ నాయకత్వంలో అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు, నామ నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై జిఎస్టి విధిస్తే చేనేతకళాకారులు తమ ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు.

also readభారీగా రేషన్ బియ్యం పట్టివేత..!

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పించాలని హైదరాబాద్లో వారిని కలిసి కోరారు. చేనేత ఉత్పత్తులపై జీరో జిఎస్టి విధించడానికి పార్లమెంటులో మాట్లాడాలని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని అఖిలభారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత వినతిపత్రం ఇచ్చి కోరగాస్పందించిన కేశవ రావు, నామా నాగేశ్వరరావు తప్పకుండా పార్లమెంటులో తమ గళం విప్పుతామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని కలుస్తామని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాధo, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవ్వారి భాస్కర్, చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube