మండల కార్యాలయాలకు భవనాలు ఉండవు

0
TMedia (Telugu News) :

అధికారులకు కుర్చీలు ఉండవు

టీ మీడియా, డిసెంబర్27, మహానంది:

మహానంది మండలం లో మండల కార్యాలయాలకు భవనాలు ఉండవు కనీసం మండల స్థాయి అధికారులు కూర్చోవడానికి కూడా కుర్చీలు ఉండవు ఇక్కడ ఇంతే కారణం ఏదైతేనేం మహానంది మండలం ఏర్పడిన అప్పటినుండి ఈరోజు వరకు ప్రైవేటు భవనాల్లో మండల పరిషత్ కార్యాలయము కొనసాగుతుంది .తహసిల్దార్ కార్యాలయం గత మూడు సంవత్సరాల క్రితం ప్రవేట్ భవనం నుండి మహానంది లోని పొదుపు సంఘం వారు ఏర్పాటు చేసుకున్న భవనంలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు .తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం 25 లక్షల రూపాయలు మండల కార్యాలయాల నిర్మాణం కొరకు నిధులు విడుదల అయ్యాయి .అనివార్య రాజకీయ కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు .కానీ గత మూడు సంవత్సరాల క్రితం మహానంది లో కార్యాలయ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు జరగడంతో పాటు భవన నిర్మాణాలు కూడా దాదాపు 75 శాతం పూర్తయ్యాయి .కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో ఆగిపోయాయి .మండల పరిషత్ కార్యాలయం తిమ్మాపురంలో ఓ ప్రైవేటు భవనంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు .

అక్కడ కనీసం సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు కూర్చోవడానికి కూడా కనీస వసతులు లేకపోవడంతో అధికారులు ఆరుబయటే చెట్టు కిందపుట్టల కింద కూర్చుని విధులు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు .మండల పరిషత్ కార్యాలయం తో పాటు మహానంది లోని పొదుపు భవనంలోవిధులు నిర్వహిస్తున్న తాసిల్దార్ కార్యాలయం కూడా కనీస వసతులు లేక ఉన్నత అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .వర్షాకాలం అయితే ఫైలు తడిసిపోతున్నాయి అని వాటిని ఎక్కడ నిల్వ ఉంచాలి సురక్షిత ప్రదేశం ఎక్కడ ఉంది అనేది అధికారులకు తలనొప్పిగా మారినట్లు సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube