టీ మీడియా, డిసెంబర్23, మధిర:
అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు. గురువారం నాడు మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు, గిఫ్ట్ ప్యాక్ దుస్తులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముందుగా వారికి దుస్తులను, గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ఎదుటి మనిషిని ప్రేమించడమే మానవజాతి అభిమతం కావాలని అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. అలానే అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని అందులో భాగంగానే ప్రతి పండుగకు వారికి అవసరమైన వాటిని అందించడం జరుగుతోందని గుర్తు చేశారు అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలిపే లక్ష్యంలో భాగంగా .
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు..రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు, అన్ని వర్గాల వారికి ఎంతోగాను ఉపయోగపడుతున్నాయని అందుకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పాస్టర్స్, క్రైస్తవ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube