ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పీ చైర్మన్ దంపతులు
టీ మీడియా, ఫిబ్రవరి 18, మధిర : మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరికీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పండుగ శుభాకాంక్షలు తెలిపారు శివరాత్రి పండుగను పురస్కరించుకుని మధిర పట్టణంలోని వైరా నది ఒడ్డున ఉన్న మృత్యుంజయ స్వామి వారి దేవస్థానంలో జరిగిన పూజ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ పాలకమండలి కమిటీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు గారు శాలువాతో లింగాల కమల్ రాజు గారి దంపతులను సన్మానించారు ముందుగా ఆలయానికి చేరుకున్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారికి ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.