జెడ్పిటిసి నీ పదవి నుండి తొలగించాలి

జెడ్పిటిసి నీ పదవి నుండి తొలగించాలి

0
TMedia (Telugu News) :

జెడ్పిటిసి నీ పదవి నుండి తొలగించాలి

టీ మీడియా ,జనవరి 9,మహబూబ్నగర్ : పెద్దమందడి మండల జడ్పిటిసి రఘుపతి రెడ్డి తన అధికార బలంతో వెల్టూర్ గ్రామానికి చెందిన నరాల ఆంజనేయులు అనే వ్యక్తినీ కులం పేరుతో దూషించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం రాత్రి నరాల ఆంజనేయులు జడ్పిటిసి ఇంటికి వెళ్లి దళిత బంధు గురించి అడగగా కులం పేరుతో దూషించాడని బాధితుడు కేసు పెట్టడానికి వెళ్తున్న సమాచారంతో మధ్యవర్తులను పంపి ఒక రోజంతా కాలయాపన చేస్తూ బుజ్జగింపు చేసే ప్రయత్నం, సంఘటన బయటికి రాకుండా కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడ్డారు. మధ్యవర్తులతో కాలయాపన చేస్తూ తిరిగి బాధితుడి పైనే కేసు నమోదు చేయడం జరిగింది.

Also Read : ఇండోనేషియా రాజకుటుంబంలోపుట్టినఇడ్లీ

జెడ్పీటీసీ ఆదివారం ఉదయం ఆంజనేయులు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతని ఫోన్ ట్రాప్ చేసి పోలీసులు మధ్యాహ్నం 3 గంటల్లోపు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆంజనేయులు ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వెల్టూరు గ్రామం చెందిన కుటుంబ సభ్యులు మరియు అదే గ్రామానికి చెందిన దళితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎమ్మార్పీఎస్ దళిత సంఘం నాయకులకు సమాచారం అందడంతో హుటహుటీన పోలీస్ స్టేషన్ కి వచ్చి కులం పేరుతో దూషించిన జడ్పిటిసి రఘుపతి రెడ్డి పై చట్టపరమైన చర్యలు, తీసుకోకుండా అని మాపైన చర్యల తీసుకుంటారా అని వారు ప్రశ్నించి.. బాధితుడు ఆంజనేయులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిఆయనను వెంటనేపదవి నుండి తొలగించాలని ఎమ్మార్పీఎస్, డీఎస్పీ దళిత సంఘాల మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. …..

Also Read : మీడియానే ప్రచారం చేస్తోంది.

పోలీసులు ఫోన్ ట్రాప్ చేసి ఆంజనేయులును పోలీస్ స్టేషన్ కి తరలించడంతో ఆంజనేయులు సోమవారం ఉదయం భయాందోళనకు గురై అకస్మాత్తుగా చాతినొప్పి, బిపి పెరగడంతో వనపర్తి లోని ప్రజా వైద్యశాల ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్ , మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా నాయకులు కొమ్ము చెన్నకేశవులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ సభ్యులు గంధం నాగరాజు తదితరులు పరామర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube