అమరావతి

Effect of Cyclone Arnab Several trains cancelled

Effect of Cyclone Arnab Several trains cancelled

By ·

Share this article
Effect of Cyclone Arnab  Several trains cancelled

 

అర్నబ్‌ తుపాను ఎఫెక్ట్​                                                                                                                                     

పలు రైళ్లు రద్దు
 
 

టీమీడియా , అక్టోబర్ 27 , అమరావతి  బ్యూరో  : రాష్ట్రంపై అర్నబ్‌ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అప్రమత్తమైంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనున్న దృష్ట్యా ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఏపీలోని పలు మార్గాల్లో నడిచే సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది.

రెండు రోజుల పాటు (రేపు, ఎల్లుండి) రద్దయిన రైళ్లు ఇవే :
రాజమహేంద్రవరం - విజయవాడ (67261)
విజయవాడ - మచిలీపట్నం (67263/67265)
మచిలీపట్నం - విజయవాడ (67264/67256)
మచిలీపట్నం - గుడివాడ (67271/67252/67254)
గుడివాడ - మచిలీపట్నం (67272/67253/67255)
కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం (17267/17268)
పార్వతీపురం - విశాఖపట్నం (07267/07268)
అక్టోబర్ 27న రద్దయిన రైళ్ల వివరాలు :

విజయవాడ - నరసాపురం (67258), నరసాపురం - విజయవాడ (67276)
నరసాపురం - రాజమండ్రి (67246), విజయవాడ - నరసాపురం (17269)
నరసాపురం - భీమవరం (17264), విజయవాడ - కాకినాడ పోర్ట్ (17257)
విజయవాడ - రాజమండ్రి (67202), విజయవాడ - నరసాపురం (67257)
విజయవాడ - మచిలీపట్నం (67267), నరసాపురం - గుంటూరు (67247)
రాజమండ్రి - కాకినాడ పోర్ట్ (67301), రాజమండ్రి - విశాఖపట్నం (67285/67286)
అక్టోబర్ 28న రద్దయిన రైళ్ల వివరాలు :

మచిలీపట్నం - విజయవాడ / విజయవాడ - మచిలీపట్నం (67266/67268/67269/67270)
విజయవాడ - భీమవరం (67275/67281), భీమవరం - నిడదవోలు (67277/67283)
నిడదవోలు - భీమవరం (67278/67284), భీమవరం - విజయవాడ (67282)
కాకినాడ పోర్ట్ - రాజమండ్రి (67302), కాకినాడ - విజయవాడ (17258)
నరసాపురం - నిడదవోలు (67244/67245), నరసాపురం - విజయవాడ (17270)
గుంటూరు - రేపల్లె (67249/67223), రేపల్లె - గుంటూరు/తెనాలి (67250/67224)
గుంటూరు/తెనాలి - విజయవాడ (67248/67222), విజయవాడ - గుంటూరు (67229)
విజయవాడ - రాజమండ్రి (67262), భీమవరం - మచిలీపట్నం (67251)
అంతకుముందు విపత్తు నిర్వహణ, సన్నద్ధతపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సందీప్ మాథుర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జీఎం తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇది 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలకు రైలు పట్టాలపై ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. క్యాచ్ వాటర్ డ్రెయిన్లు, కాలువల్లో వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని జీఎం సూచించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ అదనంగా పెట్రోలింగ్ సిబ్బందిని, వాచ్‌మెన్లను నియమించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు ట్రాక్‌లకు ఏమైనా నష్టం జరిగితే వెంటనే బాగు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మరమ్మతు సామగ్రిని ముందుస్తుగా సిద్ధం చేసి ఉంచినట్లు ఆయన వెల్లడించారు.

Tags: