hyderabad

Drunken revelers run wild in the dead of night... The lives of innocent people hang in the balance!

Drunken revelers run wild in the dead of night... The lives of innocent people hang in the balance!

By ·

Share this article
Drunken revelers run wild in the dead of night...  The lives of innocent people hang in the balance!

 

అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు..                                                    

 

 గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!

 

టీమీడియా , అక్టోబర్ 27 ,  హైదరాబాద్  బ్యూరో  : కుత్బుల్లాపూర్, అక్టోబర్ 26 : కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో మందుబాబుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. కూతవేటు దూరంలో బెల్ట్ షాపులు నిరాటంకంగా నడు స్తున్నా ఎక్సైజ్ శాఖ మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. రాత్రి వేళలో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కనిపించకపోవడంతో తాగుబోతులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. న్యాయం కోసం పోలీస్ షన్ల చుట్టూ బాధితులు చెప్పులరిగేలా తిరుగుతున్నా పోలీసుల స్పందన శూన్యంగా మారుతోంది. పలుకుబడితో చట్టం నుండి ఈజీగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలాంటి కేసుల్లో నేర స్థులు తప్పించుకుంటున్నారా… వారిని పోలీసులే తప్పిస్తున్నారా ..అనే ప్రశ్నలపై పలు అనుమానాలకు తావిస్తోంది. కానీ వారి చేతులో క్షతగాత్రులుగా మారుతున్న బాధితులకు న్యాయం దొర కడం లేదం టూ వారి బాధలు వర్ణణాతీతంగా మారుతున్నాయి. ఫలితంగా గాయాలై ఆసుపత్రుల పాలైతే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ఘటనలు ఇలా….
– పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలో గత నెల 17న తెల్ల వారుజామున 2.45 గంటలకు వెన్నెలగడ్డలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఓ నిందితుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి టాటా హెక్సా కారులో తాగి వచ్చి ఇళ్లముందు న్యూసెన్స్ సృష్టించారు. ఆ సమయంలో న్యూసెన్స్పై ప్రశ్నించిన స్థానికులు ఆర్.నవీన్ గౌడ్, స్నేహితుడు ఎన్.మణికుమార్ గౌడ్ పై కక్షగట్టి తొలుత చంపుతానని బెదిరించి, కారును ఉద్దేశ్యపూర్వకంగా అత్యంత వేగంగా వెనక్కి పోనిచ్చి వారిపై ఎక్కించారు. ఈ ప్రమా దంలో వారిద్దరికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుడిని పట్టుకోకపోవడమే కాకుండా ప్రమాదానికి గురైన కారును కూడా అదుపులోకి తీసు కోకుండా వ్యవహరిస్తున్న పోలీసుల పనితీరుపై పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.

– మరో ఘటనలో కొంపల్లిలో నివాసం ఉండే రాజస్థాన్కు చెందిన దంపతులు కొంపల్లి సినీప్లానెట్లో సినిమా చూసి తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు ఆ ద్విచక్రవాహ నాన్ని ఢీకొట్టి వెళ్లాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్రగా యాలు కాగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందగా…తన భార్య కోమాలోకి వెళ్లింది. కనీసం భర్త అంత్యక్రియలు కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి నెల కొంది. ఈ ప్రమాదంలో సదరు కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

యంత్రాంగం వైఫల్యం…
బాధితుల అరణ్యరోదన అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న బెల్ట్ షాపుల వల్ల యువత మద్యం మత్తులో క్రూరంగా మారుతున్నారు. రాత్రివే ళలో రోడ్లపై ఉండాల్సిన ట్రాఫిక్ నిఘా కరవడడం వల్ల తాగుబో తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వెన్నెలగడ్డలో బెల్టాపు నిర్వాహకుడిపై గతంలో పీడియాక్ట్ అయినప్పటికీ తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నా అటు వైపుకు పోలీసులు కన్నెత్తి కూడా చూడకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్టేషన్లో బాధి తులు ఫిర్యాదులు చేసినా సరైన న్యాయం దక్కకపోగా కొంటె సమాధానాలు, చాపకింద సర్దుబాట్లు ధోరణులు బాధితుల బతు కులను మరింత రోడ్డున పడేస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags: