aswapuram

అంగన్వాడీ భవనం  కూల్చివేయడం సరికాదు : సర్పంచ్ సర్పంచ్ సదర్ లాల్*

అంగన్వాడీ భవనం  కూల్చివేయడం సరికాదు  :సర్పంచ్ సర్పంచ్ సదర్ లాల్*

By ·

Share this article
అంగన్వాడీ భవనం  కూల్చివేయడం సరికాదు  : సర్పంచ్ సర్పంచ్ సదర్ లాల్*

*అంగన్వాడీ భవనం  కూల్చివేయడం సరికాదు

 సర్పంచ్ సర్పంచ్ సదర్ లాల్*

 

టీ మీడియా, అక్టోబర్ 31, అశ్వాపురం: గ్రామపంచాయతీ పరిధిలోని కాలువ బజార్‌లో ఉన్న అంగన్వాడీ సెంటర్ నెం.6 భవనాన్ని స్థానిక సర్పంచ్ బానోత్ సదర్ లాల్ సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా భవనాన్ని పరిశీలించగా, భవనం చాలా వరకు బాగానే ఉందని, వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండటం, కిటికీలు పాక్షికంగా ధ్వంసం కావడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు.

అయితే, అంగన్వాడీ కేంద్రాన్ని అక్కడి నుంచి తొలగించి అద్దె భవనంలో నిర్వహించడం వల్ల ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనం నిరుపయోగంగా మారి క్రమంగా శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడుతోందని సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ భవనానికి సుమారు రూ.30,000 ఖర్చుతో అవసరమైన మరమ్మతులు చేపడితే తిరిగి చక్కగా వినియోగంలోకి తీసుకురావచ్చని, అలాంటి భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం మంజూరు చేయాలని కోరడం కంటే ఉన్న భవనాన్ని మరమ్మతు చేసి ఉపయోగించుకోవడం సముచితమని తెలిపారు.

కావున సంబంధిత సీడీపీఓ అధికారులు ఈ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేయించి, ప్రస్తుతం అద్దె భవనంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని తిరిగి ఈ ప్రభుత్వ భవనంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.